Mobile Popup Ad
Mobile Popup Ad

మహానాడు వేదికపై బక్కని నర్సింహులు షాకింగ్ కామెంట్లు

కలం, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  పార్టీ కార్యకర్తలు సైతం ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సంబురాలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే మహానాడు వేదిక మీద తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ సీనియర్ నేత బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహానాడులో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని.. దీన్ని కొంతమంది స్వార్థపరులు సృష్టించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.

బక్కని నర్సింహులు తెలంగాణను అవమానించేలా మాట్లాడారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు ఈ కామెంట్లు అస్త్రంగా మారాయి. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ తెరమీదకు తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు యత్నిస్తున్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బక్కని నర్సింహులు వ్యాఖ్యలను తప్పు పట్టారు. షాద్ నగర్ గడ్డ మీద పుట్టిన బక్కని నర్సింహులు ఇటువంటి కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని వారు వ్యాఖ్యానించారు.

ఇప్పటికే రాష్ట్రంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా ప్రచారం సాగింది. తాజాగా బక్కని నర్సింహులు తెలంగాణను ఉద్దేశించి చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. మరి బక్కని కామెంట్ల వివాదం ఇక్కడితో సమసిపోతుందా? లేదంటే  మరింత ముదురుతుందా? అన్నది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>