కలం, వెబ్ డెస్క్ : తిరుపతి(Tirupati) జిల్లాలోని శేషాపురం (Seshapuram) పరిసర గ్రామాల్లో ఏనుగుల సంచారం (Elephant Movement) తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పట్టపగలే గ్రామాల్లోకి దూసుకొస్తున్న గజరాజులు అధికారులకు, గ్రామస్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎల్లంపల్లి గ్రామంలో నాలుగు ఏనుగుల గుంపు విరుచుకుపడి రైతుల చేతికొచ్చిన పంటలను ధ్వంసం చేసాయి. పొలాల్లో నిల్వ ఉన్న పంటలపై దాడి చేసి భారీ నష్టం కలిగించాయి. అదేవిధంగా వ్యవసాయ మోటార్లు, ఫెన్సింగ్ రాళ్లను కూడా పగులగొట్టి విధ్వంసం సృష్టించాయి.
కొన్ని రోజుల క్రితం అటవీ శాఖ సిబ్బందిపై కూడా ఒక ఏనుగు (Elephant) తిరగబడిన ఘటన స్థానికుల్లో మరింత భయాన్ని రేకెత్తించింది. దీంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. రాత్రి వేళలే కాకుండా పగటిపూట కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏనుగుల సంచారంతో జీవనోపాధి దెబ్బతింటోందని, పంట నష్టం తీవ్రంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను అడవిలోకి తరలించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, ఏనుగుల సంచారాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Also: హిమంత బిశ్వ శర్మ దేశంలో భారీ అవినీతిపరుడు: రాహుల్ గాంధీ
Follow Us On: Pinterest

