చమురు సంక్షోభం.. నేపాల్ సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు (fuel) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో నేపాల్‌లో (Nepal) ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి, దేశంలోని విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శని, ఆదివారాల్లో సెలవు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త నిబంధనల ప్రకారం సెలవు దినాలను పెంచినప్పటికీ పని దినాల్లో పని వేళలను ప్రభుత్వం సవరించింది. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. గతంలో నేపాల్‌లో (Nepal) శనివారం మాత్రమే అధికారిక సెలవుగా ఉండేది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పెట్రోల్ ధర లీటరుకు రూ. 202కు చేరుకోవడంతో, ప్రజలపై భారాన్ని తగ్గించాలనుకుంది. ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని నియంత్రించడానికి ఈ రెండు రోజుల వారాంతపు విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీనితోపాటు పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవడానికి అవసరమైన చట్టపరమైన వెసులుబాటును కల్పించాలని నిర్ణయించింది.

Read Also: అక్క‌డంతా రివ‌ర్స్.. ఎమ్మెల్యే అభ్య‌ర్థికే డ‌బ్బులు ఇస్తున్న ఓట‌ర్లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>