కలం, మెదక్ బ్యూరో : ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారని, రేవంత్ రెడ్డి కక్ష్యతోనే కేసీఆర్ కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) విమర్శించారు. సిద్దిపేట పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యలను పక్కదారి పట్టించడం కోసం టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో బిఆర్ఎస్ నాయకులపై రెండేళ్లుగా వేధింపులను సీరియల్ తరహాలో రెండేళ్ల నుండి కొనసాగుతున్నారని విమర్శించారు. రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం ఉండదని.. ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికీ చెప్పరని ప్రవీణ్ కుమార్ తెలిపారు.


