రూ.9కే చీర.. ఒక్కసారిగా ఎగబడిన మహిళలు, చివరకు ఏమైందంటే!

కలం, వెబ్ డెస్క్: ఏదైనా రెస్టారెంట్, షాపింగ్ మాల్, ఇతర దుకాణాలు ప్రారంభోత్సవం చేసినప్పుడు కొంతమంది నిర్వాహకులు ఆఫర్ల పేరుతో కస్టమర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అయితే ఆఫర్లు ప్రకటించడంతో జనం ఒక్కసారిగా ఎగబడుతుండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలోని గరుడ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) చేతుల మీదుగా ప్రారంభమైన ఈ మాల్‌లో రూ.9లకే చీర ఇస్తామంటూ నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఆఫర్ జనాలను ఆకర్షించింది. ఈ ఆఫర్ గురించిన సమాచారం తెలుసుకున్న మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాల్ లోపలికి వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. జనాన్ని నియంత్రించడంలో సెక్యూరిటీ సిబ్బంది ఏమిచేయలేక, చేతులు ఎత్తేయడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.

Also Read : గోల్స్ వర్షం.. రికార్డు మ్యాచ్‌తో భారత్ జోరు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>