బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్​లో ఏసీబీ రైడ్స్!

క‌లం, వెబ్‌డెస్క్: బండ్ల‌గూడ ర‌వాణా శాఖ కార్యాల‌యం (Bandlaguda RTO Office)లో ఏసీబీ అధికారులు ఆక‌స్మిక‌ త‌నిఖీలు చేప‌ట్టారు. కార్యాల‌యంలో కానిస్టేబుల్‌గా ప‌ని చేస్తున్న అరుణ్ అక్ర‌మ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నారంటూ నేడు సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. దీంతో ఉన్న‌తాధికారులు దీనిపై విచార‌ణ‌కు ఆదేశించారు. ఏసీబీ (ACB) డీఎస్పీ ఆనంద్ ఆధ్వ‌ర్యంలో టీమ్ త‌నిఖీలు చేస్తున్నారు.

ఆఫీస్‌లోని లైసెన్స్ జారీ సెక్షన్‌లో అరుణ్ డ‌బ్బులు లెక్కిస్తున్నప్పుడు ఓ వ్య‌క్తి సీక్రెట్‌గా వీడియో తీశాడు. దీన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో కార్యాల‌యంలో ఆ డ‌బ్బులు ఎక్క‌డివి? నిజంగానే కానిస్టేబుల్ అవినీతికి పాల్ప‌డుతున్నాడా? అనే కోణంలో అధికారులు విచార‌ణ ప్రారంభించారు.

Also Read : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. వారికి ఆర్థిక సాయం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>