కలం, వెబ్ డెస్క్: పల్నాడు (Palnadu) జిల్లాలో ఓ ఘరానా మోసగాడు చోరీకి పాల్పడ్డాడు. ఓ రైతు అప్పుగా తెచ్చుకున్న డబ్బును చాకచక్యంగా దొంగిలించాడు. అయితే ఈ దొంగతనం తంతు సీసీ కెమెరాలో రికార్డు అవుతుందన్నది గమనించలేకపోయాడు. ఇప్పుడు ఆ చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లాకు చెందిన రైతు వెంకట సత్యనారాయణ తన అవసరాల నిమిత్తం తెలిసిన వ్యక్తి దగ్గర రూ.5 లక్షలు అప్పుగా తెచ్చుకున్నాడు. డబ్బును తన స్కూటీ డిక్కీలో పెట్టుకొని జొన్నలగడ్డ బైపాస్‌లో ఉల్లిపాయలు కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లాడు. వెంకట సత్యనారాయణను ముందు నుంచి గమనిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి స్కూటీ డిక్కీ తెరిచి నగదు దోచుకెళ్లాడు. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చోరీని గుర్తించిన రైతు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉల్లిపాయల కోసం ఆగి.. రూ. 5 లక్షలు పోగొట్టుకున్న రైతు!
-పల్నాడు జిల్లాలోని జోనలగడ్డ బైపాస్ సమీపంలోని ఓ షాప్ కి ఉల్లిపాయలు కోసం వెళ్లిన రైతు
– ఆర్థిక అవసరాల కోసం అప్పు తెచ్చిన రూ. 5 లక్షల నగదును తన స్కూటీ డిక్కీలో పెట్టి..
షాప్ లోపలికి వెళ్లి వచ్చే లోపు నగదును దొంగిలించి పరారైన… pic.twitter.com/QaVJkMQoR0— Kalam Daily (@kalamtelugu) April 8, 2026
Read Also: ఎన్నాళ్లీ ‘డోలీ’ మోతలు.. ఏపీలో మారని గిరిజన బతుకులు
Follow Us On: X(Twitter)

