ఎన్నాళ్లీ ‘డోలీ’ మోతలు.. ఏపీలో మారని గిరిజన బతుకులు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో పాలకులు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఏజెన్సీ ప్రాంతాల్లోని (Tribal Villages) గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ముఖ్యంగా పాడేరు, పార్వతీపురం, వేలేరుపాడు, కుక్కునూరు వంటి ప్రాంతాల్లో కనీస రవాణా సౌకర్యాలు లేక గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. నేటికీ గర్భిణులు, రోగులను ఆసుపత్రికి తరలించేందుకు ‘డోలీ’లే ఏకైక దిక్కుగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించినప్పటికీ, గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు.

పార్వతీపురంలో హృదయవిదారకం

పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనుల కష్టాలకు అద్దం పట్టే హృదయవిదారక ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. పాలకొండ నియోజకవర్గం బొడ్డగూడ గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలకు (Tribal Villages) నేటికీ సరైన రహదారి లేదు. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రికి తరలించేందుకు ‘డోలీ మోతలు’ తప్పడం లేదు. అనారోగ్యం పాలైన వారిని కిలోమీటర్ల మేర కొండలు, వాగులు దాటుకుంటూ డోలీలపై మోసుకురావడం ప్రాణసంకటంగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే తమ గ్రామాలకు పక్కా రోడ్డు నిర్మించి (Transportation) ప్రాణాలు కాపాడాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

Read Also: హ‌ద్దులు దాటి మాట్లాడొద్దు.. జ‌గ‌న్‌కు జ‌న‌సేన కౌంట‌ర్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>