Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్‌ సీనియ‌ర్ నాయ‌కురాలు మొహసినా కన్నుమూత

క‌లం, వెబ్ డెస్క్‌: ఉత్త‌ర ప్ర‌దేశ్‌ కాంగ్రెస్ (Congress) సీనియ‌ర్ నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ (94) (Mohsina Kidwai) క‌న్ను మూశారు. వృద్ధాప్యంతో గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో ఉన్న‌ ఆమె బుధవారం తెల్లవారుజామున నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజ‌కీయాల్లో సుధీర్ఘ కాలం కొన‌సాగిన మొహ‌సినా కిద్వాయ్‌ కాంగ్రెస్ పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవ‌లు అందించారు. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ సభ్యురాలిగా పని చేశారు. ఆమె, గతంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో కీలక సభ్యురాలిగా సేవలందించారు. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: సామాన్యులకు ఊరట.. RBI కీలక నిర్ణయం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>