బోధన్‌లో మెరుపు దాడి.. 30 లక్షల గుట్కా డంప్ స్వాధీనం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చీతా ఫోర్స్ మెరుపు దాడులు జరిపింది. 30 లక్షల విలువైన గుట్కా (Gutka) ప్యాకెట్లు పట్టుకుంది. శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు చీతా ఫోర్స్ బోధన్ మండలంలోని ఆచన్‌పల్లి గ్రామంలో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా HKGN మటన్ షాప్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది.

పట్టుబడిన గుట్కా సరుకుల విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుంది. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన గుట్కా నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలు, రవాణాపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్వాధీనం చేసుకున్న గుట్కా సరుకును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బోధన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.

Read Also: దొంగలు దొరికేనా? ఖాకీలకే షాకిచ్చిన మాస్టర్ ప్లాన్!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>