‘కేటీఆర్‌ది అధికార దాహం’

కలం, కరీంనగర్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అధికార దాహంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ఒడితెల ప్రణవ్ (Vodithala Pranav) ఆరోపించారు. రైతుల పేరుతో డ్రామాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. లోలోపల ఒప్పందం కుదుర్చుకొని పైకి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నట్టు నటించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ బంద్‌కు పిలుపునివ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

బలప్రదర్శన కోసమే బంద్‌లు

బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత బల ప్రదర్శన కోసం బంద్‌లకు పిలుపునిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో సహేతుక విమర్శలు చేసుకోవాలి తప్ప వ్యక్తిగత విషయాలు, విమర్శలు చేసుకోవడం  సరికాదన్నారు. మొదటినుండి చెప్తున్నట్లు బీఆర్ఎస్, బీజేపీ దొందు దొందే అంటూ మండిపడ్డారు. రాజకీయనాయకులు పోలీసుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు.

కరీంనగర్ జిల్లా ప్రశాంతంగా ఉంది

కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి తప్ప, కరీంనగర్ జిల్లాలో ఏదో జరుగుతుంది అన్నట్టు సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం సబబుకాదని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డికి పోలీసు వాహనాలను ముందు వెనకాల ఉంచుకోవాలనే సోకు ఉందని అందుకే ఇలా హైలెట్ కావాలని లేనివి ఉన్నట్టుగా కల్పిస్తున్నాడని ప్రణవ్ (Vodithala Pranav) అన్నారు.

Read Also: రీల్స్ పిచ్చిపై బీసీసీఐ సీరియస్.. కొత్త రూల్స్ ఇవే!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>