మంత్రుల పర్యటనలో బాహాబాహీ: అమరావతిలో ఉద్రిక్తత!

కలం, వెబ్ డెస్క్ : అమరావతి (Amaravati) చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్‌మెన్, జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కలసి స్టాల్స్‌ను తిలకించడానికి వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. నాయకులతో పాటు లోపలికి వస్తున్న జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌ను డిప్యూటీ స్పీకర్ గన్‌మెన్ అడ్డుకుని పక్కకు నెట్టివేశారు.

ఈ చర్యతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు, మంత్రి గన్‌మెన్లు సదరు రక్షణ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య నెట్టివేతలు, అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా కాసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. అనంతరం జనసేన కార్యకర్తలు డిప్యూటీ స్పీకర్ గన్‌మెన్‌ను పక్కకు నెట్టివేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. నాయకులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో గొడవ శాంతించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>