Mobile Popup Ad
Mobile Popup Ad

RR vs RCB మ్యాచ్‌లో వికెట్లు తీసే టాప్ బౌలర్లు వీరే!

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ (IPL) 2026లో నేడు మరో ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. వరుసగా మూడు విజయాలతో తిరుగులేని ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RR vs RCB)ను ఢీకొట్టబోతోంది. ముఖ్యంగా రాజస్థాన్ బౌలర్లు ముంబైని తక్కువ పరుగులకే కట్టడి చేసి మంచి జోరు మీదుండగా, ఆర్సీబీ బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తున్నా వారి బౌలింగ్ విభాగం ధారాళంగా పరుగులు ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి జోరుమీదుంది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను కేవలం 123 పరుగులకే పరిమితం చేసి తమ బౌలింగ్ సత్తా చాటింది. మరోవైపు ఆర్సీబీ జట్టు హైదరాబాద్, చెన్నైలపై గెలిచినప్పటికీ, ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ వారి బౌలర్లు 200కు పైగా పరుగులు సమర్పించుకున్నారు.

జాకబ్ డఫీ : తన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే డఫీ అదరగొడుతున్నారు. సన్‌రైజర్స్‌పై మూడు వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆయన, చెన్నై ఓపెనర్లను కూడా స్వల్ప స్కోర్లకే పెవిలియన్ పంపారు. నేడు రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలను అడ్డుకోవడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం.

సందీప్ శర్మ : ఐపీఎల్ కెరీర్‌లో సందీప్ శర్మకు ఆర్సీబీపై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు బెంగళూరుపై 29 వికెట్లు తీసిన ఆయన, నేడు మరో వికెట్ తీస్తే ఐపీఎల్‌లో 150 వికెట్ల మైలురాయిని చేరుకుంటారు. డెత్ ఓవర్లలో రాజస్థాన్‌కు ఆయన కీలకం కానున్నారు.

నాండ్రే బర్గర్ : దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం పేసర్ బర్గర్ ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లోనూ వికెట్లు తీసి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టిన ఆయన, నేడు ఆర్సీబీ స్టార్ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్‌లను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Read Also: నేను క్రికెటర్ కావాలన్న కల నాకన్నా ముందే పుట్టింది: ముకుల్ చౌదరి

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>