Mobile Popup Ad
Mobile Popup Ad

నేను క్రికెటర్ కావాలన్న కల నాకన్నా ముందే పుట్టింది: ముకుల్ చౌదరి

కలం, స్పోర్ట్స్: “నేను క్రికెటర్ కావాలన్న కల నాకన్నా ముందే పుట్టింది..” ఈ మాటలు అన్నది మరెవరో కాదు, నిన్న ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) యువ సంచలనం ముకుల్ చౌదరి (Mukul Choudhary). కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేసిన ఈ 21 ఏళ్ల కుర్రాడు, మ్యాచ్ అనంతరం తన మనసులోని మాటను పంచుకున్నారు. లక్నో జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన ముకుల్, ఈ స్థాయికి చేరడం వెనుక తన తండ్రి పట్టుదల ఎంతో ఉందని తెలిపారు. తన తండ్రికి వివాహం కాకముందు నుంచే, తన కొడుకును ఒక గొప్ప క్రికెటర్‌గా చూడాలనే బలమైన కోరిక ఆయనలో ఉండేదని ముకుల్ వివరించారు.

రాజస్థాన్‌లోని సీకర్‌లో సరైన వసతులు లేకపోయినా, తన తండ్రి నమ్మకాన్ని నిజం చేసేందుకు ఢిల్లీ, గుర్గావ్‌లలో కష్టపడి ప్రాక్టీస్ చేశానని ఆయన చెప్పారు. గతంలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో తాను రాణించినప్పుడే, తన కొడుకు పెద్ద స్థాయికి చేరుతాడని తన తండ్రికి నమ్మకం కలిగిందని ముకుల్ గుర్తుచేసుకున్నారు.

కేకేఆర్‌పై వీరవిహారం..

ఏప్రిల్ 9న జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో గెలవాలంటే చివరి 5 ఓవర్లలో 54 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులోకి వచ్చిన ముకుల్ (Mukul Choudhary), ఏమాత్రం భయం లేకుండా 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఇందులో 7 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ముఖ్యంగా కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో ఆయన కొట్టిన షాట్లు మ్యాచ్‌ను లక్నో వైపు తిప్పేశాయి. ఫ్లడ్‌లైట్ల కింద ఆడటం ఇది తనకు రెండో సారి మాత్రమేనని, అయితే తాను ఒత్తిడిని ఒక అవకాశంగా భావిస్తానని ముకుల్ స్పష్టం చేశారు. మైదానంలో పేరు సంపాదించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశంగా దీనిని చూస్తానని, చివరి వరకు క్రీజులో ఉంటే విజయం సాధ్యమని తాను నమ్మినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ముకుల్ చౌదరి ఒక్క రాత్రిలోనే ఐపీఎల్ స్టార్‌గా మారిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>