Mobile Popup Ad
Mobile Popup Ad

RR vs MI: టాస్ గెలిచిన ముంబై.. రాజస్థాన్ ఓపెనర్ల ఊచకోత

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ (RR vs MI)  మధ్య మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభం అయింది. మ్యాచ్ జరుగుతున్న గువాహటిలో భారీ వర్షం కురిసింది. అయితే చివరి క్షణంలో వర్షం తగ్గిన కారణంగా 11 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు నిర్ణయించారు. రెండు జట్లు కూడా చెరో 11 ఓవర్లు ఆడనుండగా.. 3.2 ఓవర్ల వరకు పవర్ ప్లే ఉంటుంది. అయితే టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ కి దిగింది.

ఇదిలాఉంటే తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్నారు. ఎడాపెడా బాదుతూ బౌండరీల మోత మోగిస్తున్నారు. వీరి ధాటికి రాజస్థాన్ జట్టు 3 ఓవర్లు అయ్యే సరికి వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. జెస్వాల్ 37, వైభవ్ సూర్యవంశీ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరి ధాటిని చూస్తుంటే ముంబై ముందు రాజస్థాన్ భారీ టార్గెట్ ఉంచేలా కనిపిస్తోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>