Mobile Popup Ad
Mobile Popup Ad

అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ చేపట్టి రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, అగ్నిమాపక పరికరాలను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ పీవీ రమణ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

అటు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో మంగళవారం 16వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలపై ఎస్ఐపీబీ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, పి.నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరోవైపు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ అధ్యక్షతన మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాలతో పాటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ పై చర్చించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా అంతా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ స‌మావేశంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>