కలం, వెబ్ డెస్క్ : స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్కూల్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) కోసం ఆడుతున్నాడు. డిసెంబర్ 24న ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు రోహిత్. అయితే తాజాగా తన కూతురు స్కూల్ లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యాడు రోహిత్. ఈ స్కూల్ ను అంబానీ ఫ్యామిలీ నిర్వహిస్తోంది. ఇందులో కొందరు స్టూడెంట్లు దేశభక్తి పాటలకు పర్ఫార్మ్ చేశారు.
అందులో ఒక స్టూడెంట్ ఇండియన్ ఆర్మీ డ్రెస్ లో ‘ఏ మేరే వతన్ కో లోగో’ అనే ఎమోషనల్ సాంగ్ కు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది చూసిన రోహిత్ శర్మ (Rohit Sharma) చాలా ఎమోషనల్ అయిపోయాడు. అతని కళ్లలో నీళ్లు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రోహిత్ శర్మతో పాటు అక్కడున్న వారంతా ఆ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ కు ఎమోషనల్ కావడం ఇందులో కనిపించింది.
Read Also: కన్నీళ్లు పెట్టిస్తున్న మావోయిస్టు అగ్రనేత లేఖ.. మరణాంతరం వెలుగులోకి
Follow Us On: Youtube


