బీహార్ మాజీసీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య(Rohini Acharya).. రాజకీయాలు, లాలూ కుటుంబాన్ని వీడారు. తాజాగా తనపై తన కుటుంబం వారే చెప్పులతో దాడికి ప్రయత్నించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యాలతో లాలూ కుటుంబంలో విభేదాలు, ఘర్షణలు ముదిరాయి. ఇటీవల పార్టీ నుంచి, కుటుంబం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య, ఆదివారం తన సోదరుడు తేజస్వీ యాదవ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తేజస్వీ మరియు అతని అనుచరుల వల్లే తాను ఇంటిని విడిచివెళ్లాల్సి వచ్చిందని ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో వరుస పోస్టుల్లో వెల్లడించారు.
Rohini Acharya భావోద్వేగంగా పేర్కొంటూ..
“ఒక కూతురు, సోదరి, తల్లి అయిన నేను తీవ్రమైన అవమానం ఎదుర్కొన్నాను. అసభ్యంగా తిట్టి, చెప్పులతో బెదిరింపులకు గురి చేశారు. నా స్వాభిమానాన్ని తక్కువ చేసి చూడటానికి ప్రయత్నించారు. నేను నిజం కోసం నిలబడ్డాను, అందుకే ఈ అవమానాలు భరించాల్సి వచ్చింది” అని తెలిపారు. “నన్ను అనాథలా విడిచిపెట్టారు. ఇలాంటి భారాన్ని ఏ కుమార్తె కూడా మోసే పరిస్థితి రాకూడదు” అని వేదన వ్యక్తం చేసింది.
“నన్ను ‘మురికిదాని’ అని తిట్టిన వారు, ఇదే నేను నా తండ్రికి కిడ్నీ ఇచ్చిన వ్యక్తిని అని మరచిపోయారు. కోట్ల రూపాయలు ఖర్చయిన తర్వాత, ఎన్నో రాజకీయ ఫలితాలు పొందిన తర్వాత కూడా, నాపై ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అనుకోలేదు” అని చెప్పింది. పెళ్లైన మహిళలకు సందేశం ఇస్తూ, “మీ తండ్రి కష్టాల్లో ఉన్నా, మీ అన్నయ్య ఉన్నంతవరకు మీరు ముందుకు రావద్దు. నేను చేసిన పెద్ద తప్పు — నా ఇంటిని, నా పిల్లలను పక్కన పెట్టి తండ్రి కోసం త్యాగం చేయడం. ఇప్పుడు అదే త్యాగం నాకు అవమానంగా మారింది” అని బాధతో పేర్కొంది.
తన భర్త, అత్తమామల అనుమతి లేకుండానే కిడ్నీ దానం చేసిన విషయం గురించి పేర్కొంటూ, “నిజాయితీగా చేసిన పనికి ఇప్పుడు ‘మురికి’ అని ముద్ర వేస్తున్నారు. నా తప్పు నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడమే” అని రోహిణీ తీవ్ర భావోద్వేగంతో చెప్పింది. “ఇలాంటి పరిస్థితి ఏ ఇంట్లోనూ పునరావృతం కాకూడదు. రోహిణీ వంటి కుమార్తె ఎవరికీ ఉండకపోవడమే మంచిది” అంటూ ఆమె పోస్టు ముగించింది.
Read Also: అక్కడ లాలూ కుమార్తె.. ఇక్కడ కేసీఆర్ బిడ్డ
Follow Us on: Youtube

