తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar)పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).. సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపు నేతల విషయంలో న్యాయస్థానం ఇచ్చిన సమయం లోపు స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే ఆయన చర్చలు తీసుకోవడాన్ని ఆలస్యం చేస్తున్నారని కేటీఆర్(KTR) ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ సోమవారం సుప్రీంకోర్టులో జరగనున్నది. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన మూడు నెలల వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని పిటిషన్‌లో పేర్కొనబడింది. మరోవైపు, ఎమ్మెల్యేలపై విచారణ పూర్తిచేయడానికి అదనపు సమయం అవసరమని స్పీకర్ కార్యాలయం కూడా ప్రత్యేక పిటిషన్‌ను ఇప్పటికే దాఖలు చేసింది. బీఆర్ఎస్, స్పీకర్ కార్యాలయం వేసిన పిటిషన్‌లను సోమవారం ఒకేసారి పరిశీలించే అవకాశం ఉంది.
తెలంగాణలో ఫిరాయింపు నేతలపై వేటు వేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు.. జులై 31, 2025న కీలక తీర్పు వెలువరించింది.ఎంఎల్ఏల ఫిరాయింపులపై 3 నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఎంఎల్ఏల ఫిరాయింపుల కేసును చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారించింది. బీఆర్ గవాయ్ తీర్పులో ఎంఎల్ఏల ఫిరాయింపులపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎల్ఏల ఫిరాయింపులపై కాలపరిమితి లేదన్న సాకుతో విచారణ జరపకుండా కాలయాపన చేసేందుకు లేదని స్పష్టంగా చెప్పారు.
Read Also: నన్ను నా వాళ్లే చెప్పులతో కొట్టబోయారు: లాలూ కుమార్తె
Follow Us on : Facebook

