కలం, వెబ్ డెస్క్ : అమెరికా యువ టెన్నిస్ స్టార్ రాబిన్ మోంట్‌గోమరీ (Robin Montgomery) సరికొత్త చరిత్ర సృష్టించింది. గాయం కారణంగా దాదాపు 10 నెలలు ఆటకు దూరమైన ఈ 21 ఏళ్ల క్రీడాకారిణి, లిబెమా ఓపెన్ టోర్నీలో తన కెరీర్‌లోనే మొదటి డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందే టాప్ సీడ్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా అనారోగ్యంతో తప్పుకోవడంతో మోంట్‌గోమరీని విజేతగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచ 484వ ర్యాంకులో ఉన్న మోంట్‌గోమరీ, ఈ టోర్నీకి కేవలం క్వాలిఫైయర్‌గా అడుగుపెట్టి అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరింది.
ఈ విజయంతో అత్యంత తక్కువ ర్యాంకుతో డబ్ల్యూటీఏ ట్రోఫీ సాధించిన కొద్దిమంది ఆటగాళ్ల సరసన ఆమె (Robin Montgomery) చేరింది. 2023లో ఎలినా స్వితోలినా తర్వాత అంతటి తక్కువ ర్యాంకుతో ఛాంపియన్‌గా నిలిచింది మోంట్‌గోమరీనే. మరోవైపు ఫైనల్ ఆడలేకపోతున్నందుకు బార్బోరా క్రెజికోవా విచారం వ్యక్తం చేస్తూ, టైటిల్ గెలిచిన మోంట్‌గోమరీకి శుభాకాంక్షలు తెలిపింది. త్వరలోనే తాను కోలుకుని మళ్లీ కోర్టులోకి వస్తానని పేర్కొంది.
Read Also: రిఫుజీ క్యాంప్ నుంచి వరల్డ్ కప్ చరిత్రలోకి ఇరాంకుండా
Follow Us On: Sharechat

