కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ (Shanthi Nagar) పట్టణంలో అమావాస్య(Amavasya) సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. గో ప్రచారక్ సేవా సమితి ఆధ్వర్యంలో వాసవి మాత ఆలయంలో గల గాయత్రి గోమాతకు అలంకరణ చేసి పూజలు నిర్వహించి గ్రాసం సమర్పించారు. ఈ సందర్భంగా సభ్యులు ఆలయంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శ్రీ నగరేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని భక్తి భావంతో పూజలు చేశారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.
కార్యక్రమం అనంతరం అర్చకులు వినయ్ కౌశిక్ శర్మ చేత సభ్యులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గో ప్రచారక్ సేవా సమితి అధ్యక్షుడు రామచంద్రుడు, మాజీ అధ్యక్షుడు గాయత్రి శ్రీనివాసులు, విహెచ్‌పి జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు వెంకటరాముడు, పిఆర్ఓ కుర్వ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శాంతినగర్‌లో జరిగిన ఈ కార్యక్రమం భక్తి వాతావరణాన్ని సృష్టించింది.
Read Also: ఉదయం లేవగానే అరచేతులు ఎందుకు చూడాలి?.. కరదర్శనం ప్రాముఖ్యత ఇదే
Follow Us On: Sharechat

