కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణిలో అక్రమాలు, నిధుల మళ్లింపుపై వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలని బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి (Ponguleti Sudhakar Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణిలో సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, తద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1,600 కోట్లకుపైగా గండి పడిందనే ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్ (CM Revanth) విచారణ చేపట్టి, పారదర్శకతను నిరూపించుకోవాలని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో కొత్తగూడెంలో చేపట్టిన సింగరేణి క్వార్టర్ల నిర్మాణం, కిష్టారం గ్రామ సమీపంలోని బంకర్ నిర్మాణం, గనుల కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అప్పగింతలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ కుంభకోణంపై జాతీయ స్థాయిలోనూ పోరాటం చేస్తామని, ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను స్వయంగా కలిసి సింగరేణి సమస్యలను వివరిస్తానని పొంగులేటి (Ponguleti Sudhakar Reddy) అన్నారు.
Read Also: కేటీఆర్ అసత్య ప్రచారాలను నమ్మొద్దు: ప్రభుత్వ విప్ వేముల
Follow Us On : WhatsApp

