ఆదేశాలు పాటించకుంటే చర్యలు.. పందుల యజమానులకు హెచ్చరిక!

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) పట్టణంలో పందుల సంచారం వల్ల వ్యాధులు ప్రబలకుండా నివారించేందుకు పందుల యజమానులు తమ పందులను పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోకి తరలించాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు (Ravi Babu) శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు.

పందుల సంచారాన్ని నివారించడంలో భాగంగా యజమానులు తక్షణమే వాటిని పట్టణానికి దూరంగా తరలించాలని సూచించారు. ఆదేశాలను పాటించని వారిపై తెలంగాణ పురపాలక సంఘాల చట్టం -2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పందులను తరలించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వాటికి ఎలాంటి నష్టం వాటిల్లినా పురపాలక సంఘం బాధ్యత వహించదని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>