కలం, వెబ్ డెస్క్ : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను (Jawaharnagar Dumping Yard) తక్షణమే తరలించాలనే డిమాండ్‌తో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar)చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. డంపింగ్ యార్డ్ తరలింపు కోసం ప్రారంభించిన పోరాటం లక్ష్యం నెరవేరే వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలు తన పాదయాత్రపై చేస్తున్న విమర్శలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజల తరఫున పోరాడుతుంటే, తనకు పని లేక పాదయాత్ర (Padyatra) చేస్తున్నానని విమర్శించడం సరికాదన్నారు. డంపింగ్ యార్డ్ తరలింపుతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే వరకు తన పోరాటం ఆగదంటూ వ్యాఖ్యానించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో వ్యర్థాల రీసైక్లింగ్‌కు అవసరమైన ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి కేంద్రం నుంచి అవసరమైన నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. నిధులు తీసుకురాలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. అక్టోబర్ 27న ఏదులాబాద్‌లోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈటల పాదయాత్ర ప్రారంభించారు.
డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాలు, కాలనీల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, గాలి, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.

