కలం, వెబ్ డెస్క్ : అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న పాపులర్ రియాలిటీ షో “ది ట్రైటర్స్” ద్వారా గుర్తింపు పొందిన నటుడు ధనుంజయ్ (Dhanunjay The Traitors)పై ఒక నటి పోలీసులను ఆశ్రయించారు. తనను సోషల్ మీడియా వేదికగా లక్ష్యంగా చేసుకుని, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ మీమ్స్‌తో వేధిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేశారు.
ధనుంజయ్‌తో పాటు ఆయన సోషల్ మీడియా ఫాలోవర్లు కూడా తనపై ట్రోలింగ్, వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. “ధను-దిను” అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నిర్వహిస్తూ తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఆమె తెలిపారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

