epaper
Tuesday, November 18, 2025
epaper

అంతర్జాతీయ బోర్డర్‌లో మొదలైన రోడ్డు పనులు..

రాజస్థాన్(Rajasthan) అంతర్జాతీయ బోర్డర్‌లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) ఐజీ ఎం ఎల్ గార్గ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు షురూ అయ్యాయని ఆయన వెల్లడించారు. ‘‘మొబిలిటీ చాలా కీలకం. కాబట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా భారత ప్రభుత్వం శ్రద్ధ వహిస్తున్న రోడ్లు కూడా. కేంద్ర ప్రభుత్వం మాకు 1600 కిలోమీటర్ల రోడ్లను కేటాయించింది. ఆ రోడ్ల పనులను మొదలయ్యాయి. శ్రీ గంగానగర్, బికనెర్, జైసల్మీర్, బార్నర్ ప్రాంతాల సివిల్ అడ్మినిస్ట్రేషన్ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించాయి. అన్ని ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం జరుగుతోంది’’ అని ఆయన వెల్లడించారు.

Rajasthan | ‘‘డ్రోన్లు పెద్ద తలనొప్పిగా మారాయి. శ్రీ గంగానగర్, బికనెర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాల్లో పాకిస్థాన్‌కు చెందిన కొందరు డ్రోన్స్ ద్వారా స్మగ్లింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. వాటిని ఎదుర్కోవడం కోసం సున్నిత ప్రాంతాల్లో పలు యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశాం. తద్వారా భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేస్తున్నాం. అంతేకాకుండా చాలా పెద్ద సంఖ్యలో డ్రోన్‌లను పడగొడుతున్నాం’’ అని గార్గ్ తెలిపారు.

Read Also: వయలెన్స్ మా పంథా కాదు: మంత్రి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>