మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తండ్రి తన్నీరు సత్యనారాయణ(Satyanarayana) మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సన్నిహితులు, అనుచరుల దర్శనార్థం ఆయన పార్దీవదేహాన్ని.. హరీష్ ఇంట ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు చేయనున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావును పరామర్శించేందుకు వారి ఇంటికి వెళ్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి మాగంటి సునీత సహా పలువురు సీనియర్ నేతలు హరీష్ రావును పరామర్శరించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్ కూడా ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించబడతాయి.

