కలం వెబ్ డెస్క్ : దేశంలోని బలహీన వర్గాలకు మోడీ ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విమర్శించారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi) సహా దేశవ్యాప్తంగా పలువురు ముఖ్య నేతలు హారయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉపాధి హామీ పథకం పేరు మార్పు, దేశవ్యాప్తంగా సర్(SIR) పరిణామాలు పార్టీ ఆధ్వర్యంలో చేయాల్సిన ఆందోళనలపై పై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇటీవలి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని(MGNREGA) రద్దు చేసి లక్షలాది పేదలను, బలహీన వర్గాలను నిరాశ్రయుల్ని చేసిందని ఖర్గే (Kharge) ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పేదల పొట్టకొట్టి వారికి వెన్నుపోటు పొడిచిందన్నారు. ఉపాధి హామీని రద్దు చేయడం జాతిపిత మహాత్మా గాంధీని అవమానించడమేనన్నారు. ఉపాధి హక్కును రద్దు చేయడం అందరి సామూహిక నైతిక వైఫల్యమని వ్యాఖ్యానించారు. ఇది కొన్నేళ్ల పాటు దేశంలో కోట్లాది మంది కార్మికుల ఆర్థిక నష్టాలకు దారితీస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఎంపీ శశిథరూర్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఢిల్లీ పోలీసుల భారీ ఆపరేషన్.. 285 మంది నేరస్తుల అరెస్ట్
Follow Us On: Sharechat


