కలం, వెబ్ డెస్క్: ప్రజా పాలన ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రంగం వ్యవసాయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మరోసారి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు మంత్రులు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాము ధర్నా చేస్తే రైతులు నలుగురు కూడా వస్తలేరని.. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే ఒప్పుకుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా జోక్యం చేసుకుని పరిష్కరిస్తున్నారని చెప్పారు. తాము స్వయంగా రైతులతో భాగస్వామ్యపై మంత్రులు, ఎమ్మెల్యేలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరిస్తున్నామని వివరించారు.
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ చేస్తున్న ‘రైతు గోస – బిజెపి భరోసా’ (BJP Rythu Gosa Yatra) యాత్రపై మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతలు రైతు గోస యాత్ర చేయడం కాదని.. ఢిల్లీ వెళ్లి పెట్రోల్ గోస యాత్ర చేయాలని మండిపడ్డారు. రైతులకు యూరియా సరఫరా చేయడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉందని స్పష్టం చేశారు. రానున్న వర్షాకాలం సీజన్ లో యూరియా కొరత రాకుండా చూసే బాధ్యత బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ కి తగిన విధంగా రైతులకు ఎరువులు సప్లై చేయాలని కోరారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని వివరించారు. ధాన్యం సేకరణ కేంద్రాల నుండి మిల్లులకు వాహనాల ఇబ్బందులు లేకుండా రోడ్లపై ఉండి వాహనాలు తీసుకొని ధాన్యం తరలిస్తున్నామని పొన్నం (Ponnam Prabhakar) చెప్పారు.
Read Also: పేదలను సంతృప్తి పరిచేలా ఇండ్ల నిర్మాణాలు : మంత్రి పొంగులేటి
Follow Us On : WhatsApp

