కలం, వెబ్ డెస్క్ : సింగపూర్‌లో (Singapore) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రేయసిని రహస్యంగా కలవడానికి వెళ్లిన ఓ ఫిట్‌నెస్ ట్రైనర్(Fitness Trainer), అనుకోని పరిస్థితులలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల ప్రకారం, ఆ ఫిట్‌నెస్ ట్రైనర్ తన ప్రేయసిని ఆమె నివాసంలో కలుసుకోవడానికి వెళ్లాడు. అయితే అదే సమయంలో ఆమె భర్త ఇంటికి రావడంతో భయాందోళనకు గురైన ట్రైనర్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ కిటికీ ద్వారా బయటకు వెళ్లాలని ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రేయసి కోసం వెళితే ప్రాణం పోయింది!
-ప్రేయసిని కలువడానికి ఆమె ఇంటికి వెళ్లిన ఫిట్‌నెస్ ట్రైనర్
-అప్పుడే ఆమె భర్త ఇంటికి రావడంతో అపార్ట్‌మెంట్ కిటికీ నుంచి బయటకు వెళ్లాలని ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి
-సింగపూర్‌లో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్Secret… pic.twitter.com/hKjzW9Q6Ee
— Kalam Daily (@kalamtelugu) May 29, 2026
Read Also: రోజూ 10 నిమిషాలు ధ్యానం చేస్తే.. ఎన్ని అద్భుత ప్రయోజనాలో తెలుసా?
Follow Us On: Instagram

