కలం, వెబ్ డెస్క్ : నటుడు శివాజీ(Shivaji)పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV ) సంచలన కామెంట్స్ చేశారు. శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ చేస్తూ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. మంచు మనోజ్ పోస్ట్ ను అభినందిస్తూ మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ ను ఆర్జీవీ రీపోస్ట్ చేశారు. ఈ సందర్భంగా శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు శివాజీ పూర్తి పేరు కూడా తనకు తెలియదన్న ఆర్జీవీ.. శివాజీ.. నువ్వెవడివైనా సరే నీ ఇంట్లో మహిళలు నీలాంటి సంస్కారహీనుడిని భరించడానికి సిద్ధంగా ఉంటే వెళ్లి వారికి ఈ నీతులు చెప్పుకోవాలన్నారు. అంతే తప్ప, సమాజంలోనో లేక సినీ పరిశ్రమలోనే ఉండే ఇతర మహిళల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. నీ పనికిమాలిన అభిప్రాయాలను మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోవాలని RGV ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: ప్రభాస్, సుజిత్ కాంబో సెట్ అయ్యిందా..?
Follow Us On: Youtube


