కలం, వెబ్ డెస్క్: ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా ప్రతి పైసా ప్రజల కోసం ఉపయోగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ(Thallada) మండలం పినపాక గ్రామంలో నూతన సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి పైసాను ప్రజల కోసమే ఖర్చు చేస్తోందని, దుర్వినియోగం జరగడం లేదని స్పష్టం చేశారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.12,500 కోట్లు విద్యుత్‌శాఖకు ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శిస్తూ, అలాంటి వ్యాఖ్యలకు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. రెండేళ్లుగా అసెంబ్లీకి రాని కేసీఆర్ మీడియా సమావేశాల్లో మాత్రమే మాట్లాడుతున్నారని, శాసనసభకు రావడానికి భయపడుతున్నారని భట్టి(Bhatti Vikramarka) విమర్శించారు.
Read Also: ఉత్తమ్, భట్టి రూ.7వేల కోట్లు పంచుకున్నారు: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)


