epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ప్రభాస్, సుజిత్ కాంబో సెట్ అయ్యిందా..?

కలం, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ (Director Sujeeth).. ఈ ఇద్దరి కాంబోలో సాహో అనే సినిమా రూపొందడం.. ఆ సినిమా సౌత్ లో ఫ్లాప్ అవ్వడం.. నార్త్ లో సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఇక సాహో తర్వాత సుజిత్.. పవర్ స్టార్ తో ఓజీ సినిమా చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో సుజిత్ తో సినిమా చేయడానికి టాప్ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్ గా.. ప్రభాస్, సుజిత్ కాంబో ఫిక్స్ అంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. సుజిత్ నెక్ట్స్ ఏంటి..? నిజంగానే ఈ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

సుజిత్.. నెక్ట్స్ సినిమా నేచురల్ స్టార్ నానితో చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత ఓజీ 2 చేస్తాడనుకుంటే.. ఇప్పుడు ప్రభాస్ పేరు వినిపిస్తుంది. సాహో సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ప్రభాస్, సుజిత్ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకనే ప్రభాస్.. సుజిత్ తో మరో సినిమా చేయాలి అనుకుంటున్నాడట. ఈసారి ప్రభాస్ తో సినిమా చేస్తే.. యాక్షన్ కామెడీ మూవీ చేయాలని ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో సుజిత్ చెప్పాడు.

దీంతో సుజిత్ ప్రభాస్ తో సుజిత్(Prabhas Sujeeth) యాక్షన్ కామెడీ మూవీ చేస్తాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను హోంబోలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించనున్నారని టాక్. ఈ ఆఫరే కాకుండా.. సుజిత్ కు మరికొన్ని భారీ ఆఫర్స్ వస్తున్నాయని తెలిసింది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఓజీ 2 ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కాకుండా యువీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఓజీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో సుజిత్ వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయ్యాడు.

Read Also: నీ అభిప్రాయాలు మడిచి.. శివాజీపై ఆర్జీవీ ఆగ్రహం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>