Mobile Popup Ad
Mobile Popup Ad

కొహెడ ఫ్రూట్​ మార్కెట్​ భూమిని అమ్మేందుకు రేవంత్​ కుట్ర : హరీశ్​ రావు

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్ నగర శివారులోని కొహెడలోని ఫ్రూట్​ మార్కెట్​ (Koheda Fruit Market) భూమిని అమ్మేందుకు సీఎం రేవంత్​ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao) ఆరోపించారు. ఫ్రూట్​ మార్కెట్​ కు చెందిన రూ.3000 కోట్ల విలువైన 200 ఎకరాల భూమిని రేవంత్​ రెడ్డి తన అనుచరులతో పాటు దళారులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ భూమిని కొనేందుకు కేరళ నుంచి వచ్చిన దళారులతో లీలా హోటల్లో చర్చలు జరిపినట్లు కూడా సమాచారం ఉందని తెలిపారు. మార్కెట్​ భూమిని కంపెనీలకు, దళారులకు కట్టబెట్టి.. దిల్​ (డెక్కన్​ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ లిమిటెడ్​ ) భూమిలో మార్కెట్​ కట్టుకోవాలని చెబుతున్నారన్నారు. దిల్​ భూములపై ఏపీ ప్రభుత్వం కేసు వేసిందని, ఆ కేసు ఇప్పట్లో తేలదని చెప్పారు. కొహెడ మార్కెట్ లో రోజుకు 25 వేల మంది రైతులు వ్యాపారం చేసుకుంటారని.. ఆ రైతుల పొట్టకొట్దకూడదన్నారు. లక్షల మంది రైతుల కోసం పని చేయాల్సిన సీఎం.. దళారుల కోసం ఆలోచన చేస్తారా? అని హరీశ్​ రావు ప్రశ్నించారు. మార్కెట్ నిర్మాణానికి స్థలంతో పాటు రూ. 350 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ‘దిల్’ భూములను రైతుల మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా ఎలా ఇస్తారు? అని అడిగారు. కమీషన్ల కోసం వేలాది మంది రైతుల భూమిని TGIICకి అప్పగించి తమ వాళ్లకు కట్టబెడతారా రేవంత్ రెడ్డి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోహెడలోనే ఫ్రూట్ మార్కెట్ పనులు ప్రారంభించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాడుతామని హరీశ్​ రావు (Harish Rao) హెచ్చరించారు.

Read Also: మందుబాబులకు బ్యాడ్​ న్యూస్​.. వచ్చే నెలలో లిక్కర్ రేట్ల పెంపు?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>