కలం, సినిమా : తమిళనాడు రాజకీయాలలో ఆసక్తికర చర్చకు దారి తీసేలా ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దివంగత డీఎంకే అధినేత ఎం. కరుణానిధి (Karunanidhi) వెనుక ఓ చిన్నారి నిలబడి ఉన్న ఫోటో ప్రస్తుతం నెటిజన్‌ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ చిన్నారి మరెవరో కాదు, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో ప్రభంజనం సృష్టించిన నటుడు, టీవీకే అధినేత విజయ్(TVK Chief Vijay).
ఈ ఫోటోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ట్వీట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తన వెనుక ఉన్న పిల్లవాడు ఒక రోజు తన పార్టీనే నాశనం చేస్తాడని కలైంగర్ కలలో కూడా ఊహించి ఉండరు’ అంటూ ఆయన పేర్కొనడం వైరల్‌గా మారింది. తాజా ఎన్నికల ఫలితాలలో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అద్భుత విజయం సాధించడంతో ఈ పాత ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనితో నెటిజెన్స్ ఈ ఫోటోను బాగా షేర్ చేస్తున్నారు.
Read Also: నేను రాజీనామా చేయను: మమతా బెనర్జీ సంచలన ప్రకటన
Follow Us On : WhatsApp

