కేంద్రం నిర్ణయంపై చంద్రబాబు హర్షం

కలం, వెబ్ డెస్క్: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast Railway Zone) ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇది కీలక ముందడుగుగా అభివర్ణించారు. ‘దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ నెరవేరినట్టైంది.‘ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. 2026 జూన్ 1 నుంచి కొత్త జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రాంత రైల్వే వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ముఖ్యంగా వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస–ఇచ్చాపురం వంటి కీలక రైల్వే సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడం ద్వారా రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులకు సౌకర్యాలు పెరగడమే కాకుండా, సరకు రవాణా వేగవంతం అయ్యే అవకాశం ఉంది. .

విశాఖ, రాయగడ మధ్య సమన్వయం

కొత్తగా ఏర్పడుతున్న విశాఖ డివిజన్‌తో (South Coast Railway Zone) పాటు రాయగడ డివిజన్ మధ్య సమన్వయం పెరగడం ద్వారా రైల్వే వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశముంది. ఈ మార్పులు ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి బలమైన ప్రోత్సాహం ఇస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, ఎగుమతులు, లాజిస్టిక్స్ రంగాలకు ఈ జోన్ ఏర్పాటు కీలకంగా మారనుంది.

కేంద్రం చారిత్రక నిర్ణయం

ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడనుంది. కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం వంటి అంశాల్లో రైల్వే జోన్ పాత్ర కీలకంగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి పలువురు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Read Also: నేను రాజీనామా చేయను: మమతా బెనర్జీ సంచలన ప్రకటన

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>