Mobile Popup Ad
Mobile Popup Ad

‘​ప్రైవేట్ సంస్థలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ విస్తరించాలి’

కలం, ఖమ్మం బ్యూరో: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సేవలు సామాన్య జనాలకు మరింత చేరువయ్యేలా విస్తరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju) పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం నగరంలో నిర్వహించిన ‘బీఎస్ఎన్ఎల్ నల్లగొండ బిజినెస్ ఏరియా సలహా సంఘం’ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ దూసుకుపోతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని బీఎస్ఎన్ఎల్ వేగంగా అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. తద్వారా ప్రైవేట్ టెలికాం కంపెనీల పోటీని తట్టుకుని, వాటికి దీటుగా ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్ఎన్ఎల్ ఎదగాలని సూచించారు. ముఖ్యంగా నెట్‌వర్క్ సమస్యలు ఎక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు, గూడాలకు సైతం బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

వినియోగదారులకు నాణ్యమైన సేవలందించడంతోపాటు, అందరికీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని ఎంపీ స్పష్టం చేశారు. ఇందుకోసం మరిన్ని నూతన టవర్ల ఏర్పాటుకు, అవసరమైన అనుమతుల మంజూరుకు పార్లమెంటులో గళం విప్పుతానని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ​ముందుగా, ఈ సమావేశానికి విచ్చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు బీఎస్ఎన్ఎల్ నల్లగొండ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పీ వెంకటేశం పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎంపీని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘు రామ్ రెడ్డి, బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు, సలహా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>