కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ’అపర్ణ మెస్సీ టీమ్ వర్సెస్ సింగరేణి ఆర్ఆర్ టీమ్‘ ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న లియోనల్ మెస్సీ (Lionel Messi) నేరుగా ఫలక్ నూమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఆ తరువాత ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) మెస్సీ ఫుట్ బాల్ ఆడారు. ఈ సమయంలో రేవంత్ తన మనవడిని తీసుకొచ్చి సరదాగా మెస్సీతో ఫుట్ బాల్ ఆడించారు. అలాగే, ఫోటో కూడా తీసుకున్నారు. సీఎం మనవడు మెస్సీతో ఆడిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా, ఉప్పల్ లో జరిగిన మెస్సీ (Lionel Messi) ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ ను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మెస్సి గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వెళ్లిపోయేంత వరకు అభిమానులు ఆయనను చూస్తూ ఉండిపోయారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో పాటు తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఇతర మంత్రులు హాజరయ్యారు.
Read Also: రాహుల్‌తో కలిసి ఢిల్లీకి సీఎం రేవంత్
Follow Us On: Sharechat


