విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.10లకే టీ, రూ.20లకే స్నాక్స్

కలం, వెబ్ డెస్క్: విమాన సేవలు విస్తృతంకావడంతో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు సైతం వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో క్యాంటీన్ల ధరలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయి. కొన్ని ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుల్లో (Airports) టిఫిన్ చేయాలన్నా వందల్లో ఖర్చు అవుతోంది. అలాంటివారిని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణికులకు ఊరటనిస్తూ విమానాశ్రయాల్లో చౌక ధరలకే ఆహార పదార్థాలను అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దేశంలోని మరో 11 విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కేఫ్ లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.

సామాన్య ప్రయాణికులకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ఈ కేఫ్‌ల ప్రధాన ఉద్దేశం. ఈ ప్రత్యేక కేఫ్‌లలో టీ, కాఫీ, సమోసా, వాటర్ బాటిల్ వంటి వస్తువులను కేవలం 10 రూపాయలకే లభించనుంది. అలాగే వివిధ రకాల స్నాక్స్‌ను 20 రూపాయలకే అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ధరల విషయంలో సామాన్య ప్రయాణికులకు భారీ ఊరట కలగనుంది.

Read Also: ‘అందుకే మౌనికను హత్య చేశా’.. నిందితుడి షాకింగ్ కామెంట్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>