కలం, వలిగొండ: ఈ నెల 9న కలంలో వలిగొండ (Valigonda) రోడ్డుపై గుంతల బీభత్సం అనే శీర్షికతో వార్త ప్రచురించడం జరిగింది. ఈ వార్తతో పలువురు రోడ్డు దుస్థితిపై ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం ఆర్ అండ్ బి అధికారులను భువనగిరి-వలిగొండ (Valigonda-Bhuvanagiri Road) మధ్య ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని ఆదేశించారు. రోడ్డు దుస్థితిని వెలుగులోకి తీసుకొచ్చి సమస్యకు పరిష్కార మార్గం చూపిన కలం న్యూస్ కు ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.

