కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం ఉచిత పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. పేద ప్రజల ఆహార భద్రతే లక్ష్యంగా ప్రారంభమైన ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం తగ్గింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ బియ్యం అందేలా చూడటంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా లంచ్ (Fine Rice Lunch) ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఈ సన్న బియ్యం భోజనాన్ని (Fine Rice Lunch) రుచి చూశారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా హాజరై సన్న బియ్యం తినడం విశేషం. వీరితో పాటు తీన్మార్ మల్లన్న, విజయశాంతి లాంటివారు కూడా పాల్గొనడంతో ఈ లంచ్ ప్రత్యేకార్షణగా నిలిచింది.
Read Also: మావోయిస్టు పార్టీ : 60 ఏళ్ళ ప్రస్థానం.. రెండేళ్లలో పతనం!?
Follow Us On : WhatsApp

