కలం, వెబ్ డెస్క్ : మాజీ సీఎం కేసీఆర్ (KCR) తో తనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు, గొడవలు లేవని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే.. అంత వరకే ఆయన గురించి మాట్లాడగలనని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కు కుటుంబంలోనే సమస్యలున్నాయని.. తనతో, తెలంగాణ ప్రజలతో కాదని రేవంత్ చెప్పారు. కేసీఆర్ కుటంబమే పదవుల కోసం పాకులాడుతోందని… వారసత్వ రాజకీయాల కోసం ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్ (Delimitation) మీద కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు పోరాడాలని సీఎం రేవంత్ (Revanth Reddy) పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ పేరుతో సౌత్ స్టేట్స్ కు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఒకలాగా, దక్షిణాది రాష్ట్రాలకు ఒకలాగా డీలిమిటేషన్ ఉంటే కచ్చితంగా పోరాటం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో తనను 2034 వరకు ప్రజలు సీఎంగా ఉంచుతారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడిస్తామన్నారు.
Read Also: తెలంగాణకు నేనే హీరో: రేవంత్ రెడ్డి
Follow Us On: Youtube

