కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వంజర్ గ్రామానికి చెందిన ముక్కెర భోజన్న అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2 లక్షల ఎల్ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) శనివారం బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని అన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యేకు భోజన్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

