Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతి ఊరు ఒక అంకాపూర్ కావాలి : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : నిజమాబాద్ జిల్లాలోని అంకాపూర్ (Ankapur) రైతులు లాభసాటిగా వ్యవసాయం చేస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. అక్కడ ప్రతి రైతు లగ్జరీ కార్లలో తిరుగుతూ వ్యవసాయం చేస్తున్నారని.. కాబట్టి ప్రతి గ్రామం ఒక అంకాపూర్ కావాలని సీఎం రేంత్ (Revanth Reddy) అన్నారు. ‘ప్రతి రైతు కారు కొనుక్కునే స్థాయికి రావాలి. ప్రతి ఊరును అంకాపూర్ లా తీర్చిదిద్దుతాం. రైతులు వేరే పంటకు వెళ్తే ఆర్థికంగా నష్టపోతామని ఆలోచన చేయకండి. దిగుమతులు చేసుకుంటున్న పంటలన్నీ మన దగ్గరే పండిస్తే లాభపడుతాం’ అని సీఎం రేవంత్ చెప్పారు.

అమెరికా ఇక్రిశాట్ ను కూడా ఇక్కడే పెట్టారంటే ఈ భూములు సారవంతమైనవని అందరూ అర్థం చేసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘తెలంగాణ అంటేనే సారవంతమైన భూమి. అందుకే టెక్నాలజీని వ్యవసాయంలో తీసుకొచ్చి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం. అంతర్జాతీయ మార్కెట్ లో మన రైతుల పంటలు ఎగుమతులు చేయడానికి చొరవ తీసుకొంటాం. తెలంగాణలో పండే ప్రతి గింజ మనల్ని బంగారు తెలంగాణగా మారుస్తుంది. రైతుల దగ్గర డబ్బులు ఉంటే సాయంత్రం వైన్స్ లో పెడుతారు. కాబట్టి మహిళల చేతుల్లో డబ్బులు ఉంటే ఇంటికి ఉపయోగిస్తారు. అందుకే మా ప్రభుత్వం కరెంట్, రేషన్ కార్డులు, ఉచిత బస్సులు ఇవన్నీ మహిళల ప్రాతిపదికనే ఇస్తున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు.

Read Also: సాదాబైనామాలకు పరిష్కారం చూపిస్తాం: మంత్రి పొంగులేటి

Follow Us On: Sharechat

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>