సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేని మంత్రిని చేస్తా: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : సిద్దిపేట జిల్లా నర్మెట్టలో (Narmetta) టీజీ ఆయిల్‌ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించిన వేళ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నర్మెట్టలో జరిగిన బహిరంగ సభలో  మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించాలని ప్రజల్ని కోరారు. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేని మంత్రిని చేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పరోక్షంగా ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

ఎన్నికలప్పుడే రాజకీయాలు ..

ప్రతిపక్షం ప్రజలపై కక్షతో వ్యవహరించకూడదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రతిపక్షం ప్రభుత్వానికి సూచనలు చేయాలన్న సీఎం.. అభివృద్ధికి అడ్డం పడుకుంటే ఆగుతామా? సీఎంగా సిద్ధిపేటకు (Siddipet) రాలేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని.. ఆ తర్వాత అభివృద్ధికి అంకితం అవుదామని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు సమస్యలు తీసుకువచ్చినా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌తో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని.. కానీ ఆ నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి కోసం కూడా పనిచేస్తామని స్పష్టం చేశారు. తాను ఏ నియోజకవర్గంపై వివక్ష చూపించనన్నారు.  వివక్ష తన ఇంటా వంటా లేదని తెలిపారు. వివక్ష చూపితే నర్మెట్ట ఫ్యాక్టరీ కొడంగల్‌కు తరలించగలిగేవాణ్ని.. అలా చేయలేదు కదా అంటూ వ్యాఖ్యానించారు.

Read Also: ఈ ఏడాది ఇందిరమ్మ ఇళ్లలో కోత..?

Follow Us On: Instagram

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>