గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. సభా వేదికగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. మొత్తం 73లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3590 కోట్లను రిలీజ్ చేశారు. రైతు భరోసాను మూడు విడతలుగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

అందులో భాగంగా మొదటి విడత నిధులను నేడు రిలీజ్ చేసింది ప్రభుత్వం. తమది రైతుల ప్రభుత్వం అని.. అందుకే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించామని సీఎం రేవంత్ తెలిపారు. బీఆర్ ఎస్ చేసిన అప్పుల వల్లే రైతు భరోసా (Rythu Bharosa) కొంత ఆలస్యం అవుతోందని.. కానీ రైతుల కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిధులను ఆపేది లేదన్నారు. తమ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రుణామాఫీ చేసి రైతుల పక్షాన నిలబడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read Also: ఉద్యోగి జీతంలో ‘ప్రణామ్’ కట్టింగ్ ఎంత? ప్రభుత్వ పరిశీలనలో 10%-15%!

Follow Us On: Instagram

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>