Mobile Popup Ad
Mobile Popup Ad

తల, మొండెం వేరు.. ఎర్రుపాలెంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం (Yerrupalem) మండలం బనిగండ్లపాడు కట్టలేరు బ్రిడ్జి దగర హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బ్రిడ్జి పై నుంచి ఉరివేసుకొని మృతి చెందగా…ఈ ఘటనలో శిరస్సు నుంచి శరీరం వేరవడం గమనార్హం. ఇది హత్య! ఆత్మహత్య! అనే అనుమానాలు స్థానికంగా వెలువడుతున్నాయి. ఎందుకంటే అంత ఎత్తు నుంచి ఆత్మహత్య చేసుకోవడం అసాధ్యమని ఘటనను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.మృతుడి వివరాలు ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>