కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేందుకు ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇందుకు ప్రతీ రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, సోలార్ కిచెన్ లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. వీటికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Read Also: పరిహారం కోసం ఇండ్లు కడుతున్నారు..!
Follow Us On: Youtube


