పీహెచ్‌సీ సేవలపై కలెక్టర్ అంకిత్ సమీక్ష

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)  జిల్లా రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(PHC) జిల్లా కలెక్టర్ అంకిత్(Collector Ankit) ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలపై పేషంట్లను నేరుగా అడిగి తెలుసుకున్నారు. లాబొరేటరీలో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. మెడికల్ స్టోర్‌ను తనిఖీ చేసి, అవసరమైన ఔషధాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఔట్ పేషంట్ విభాగాన్ని సందర్శించి రోజువారీగా వచ్చే రోగుల సంఖ్యపై ఆరా తీశారు. రక్త పరీక్షలు, టీకాల లభ్యత, అత్యవసర సేవల స్థితిగతులను కూడా సమీక్షించారు.

రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతర వైద్య సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ (Collector Ankit) సూచించారు. ఈ సందర్భంగా కుక్క కాటుకు గురైన ఒక బాలుడిని పరామర్శించి, అతనికి అందుతున్న చికిత్సపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో వైద్య సేవల మెరుగుదలకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ స్వప్నతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: షాకింగ్.. గుడ్డు పెట్టిన కోడిపుంజు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>