కలం, తెలంగాణ బ్యూరో: Operation Kagar | మావోయిస్టు పార్టీ అంతమైనట్టేనా..? ఉద్యమం ఉనికిని కోల్పోయినట్టేనా..? సాయుధ పోరాటానికి కాలం చెల్లినట్టేనా..? ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో మనుగడ ప్రశ్నార్థకమేనా..?ఇకపై అదంతా ముగిసిన అధ్యాయమేనా..? భవిష్యత్ తరాలకు చరిత్ర మాత్రమేనా..? మావోయిస్టు అగ్రనేత గణపతి (Maoist Ganapathi) ప్రభుత్వానికి లొంగుతారా..? మిస్టరీగా మిగిలిపోతారా..? ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలు.. సమాధానాలు మాత్రం వేర్వేరు.
కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి 1న మొదలుపెట్టిన ‘ఆపరేషన్ కగార్’ తో మావోయిస్టు ఉద్యమం కుదేలైంది. వరుస ఎన్‌కౌంటర్లు, సరెండర్లతో లీడర్లు, కేడర్ లేని పార్టీగా మిగిలిపోయింది. దాదాపు ఆరు దశాబ్దాలుగా దేశ అంతర్గత భద్రతకే సవాలుగా నిలిచి, దండకారణ్యంలో జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టు పార్టీ ‘గతం’ ఎలా ఉన్నా వర్తమానం, భవిష్యత్తు మాత్రం గందరగోళం. ఆపరేషన్ కగార్ ముగింపుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేయబోయే ప్రకటన ఏమిటనేది ఇప్పుడు కీలకం. నక్సల్బరీలో మొదలై శ్రీకాకుళం మీదుగా తెలంగాణకు చేరి 12 రాష్ట్రాలకు విస్తరించిన పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ ఎడిషన్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: క్షమించండి.. ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉంది: కవిత
Follow Us On : WhatsApp

